హైదరాబాద్‌లో ఓ దొంగ రెచ్చిపోయాడు. నార్సింగిలోని హైదర్ కోట్ సన్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయాడు. చోరీ ఘటన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.