అప్పుడే పుట్టిన ఓ శిశువు ఓ ట్రేను బాహుబలిలా తన 2 చేతులతో పట్టుకుని మోయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నర్సులు శిశువును తీస్తుండగా ట్రేను అలాగే పైకి లేపడం మనం వీడియోలో చూడొచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు కొందరు నిజమైన
బాహుబలి పుట్టాడని కామెంట్స్ చేస్తుంటే ఇంకొందరు శిశువును తలకిందులుగా పట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.