చీమల్ని చూసి మనిషి నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలానే ఉంది. టీమ్ వర్క్ కు ప్రతిరూపం చీమలు. చిన్న చిన్న చీమలు పెద్ద సర్పాని అంతమొందించాయని కథల్లో చదువుకున్నాం. చిన్న చిన్న చీమలు కలిసి పెద్ద పెద్ద వస్తువుల్ని, ఆహార పదార్ధాల్ని మోసుకుపోవటం చూసి ఉంటాం. కానీ చీమల్ని పెద్దగా పట్టించుకోం. చీమలు టీమ్ వర్కుకే కాదు క్రమశిక్షణకు మారుపేరు. అంతేకాదు నిరంతర కష్టజీవులు. ఏ చీమా కూడా సోమరిగా ఉండదు. ఏదోక పని చేస్తుంటుంది.