లక్నోలో విషాదం చోటుచేసుకుంది. రాజ్కియా బాల్‌గ్రిహాలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అలాగే మరి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.