మద్యం మత్తులో గొడవ.. ముగ్గురి మృతి

78చూసినవారు
మద్యం మత్తులో గొడవ.. ముగ్గురి మృతి
బెంగళూరు శివారులో హోలీ వేడుకలలో భాగంగా జరిగిన గొడవలో ముగ్గురి మరణించారు. బీహార్‌కు చెందిన ఆరుగురు బెంగళూరులో కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే హోలీ పండుగ సందర్భంగా ఆరుగురు మందు పార్టీ జరుపుకున్నారు. ఈ పార్టీలో ఓ మహిళ గురించి వివాదం చెలరేగడంతో ఒకరినొకరు కర్రలు, రాడ్లతో తలలు పగలగొట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్