కొమురం భీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. వేంపల్లి రైల్వే క్యాబిన్ సమీపంలో నేడు మధ్యాహ్నం రైల్వే సిబ్బందికి పులి కంట పడింది. పులి రైల్వే ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పులి సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.