పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం అంకితభావాన్ని గౌరవించడానికి, అభినందించడానికి జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం అంకితం చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రులు పట్ల వారి కృతజ్ఞత, ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ప్రత్యేక రోజుగా భావిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో తల్లిదండ్రుల ప్రేమ, మద్దతు కీలకం. ఇవాళ జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా వారి నిబద్ధతకు ధన్యవాదాలు తెలియజేయండి.