అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

68చూసినవారు
అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆదివారం ఉ. 6 గంటల నుంచి మ.1 వరకూ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్