విషాదం.. జన్మనిచ్చిన కాసేపటికే మృత్యుఒడిలోకి వెళ్లిన మహిళ

52చూసినవారు
విషాదం.. జన్మనిచ్చిన కాసేపటికే మృత్యుఒడిలోకి వెళ్లిన మహిళ
యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేరఠ్‌కు చెందిన కరిష్మాకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను పై ఫ్లోర్‌ నుంచి కింద ఉన్న ఫ్లోర్‌కి లిఫ్ట్‌లో తరలిస్తుండగా.. లిఫ్ట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కరిష్మాకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కరిష్మా భర్త వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్