విషాదం.. కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగిన బాలుడు

78చూసినవారు
విషాదం.. కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగిన బాలుడు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగిన రెండేళ్ల బాలుడు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్‌ కరిముల్లా, అమ్ము దంపతులకు కరిష్మా, కాలేషా(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 7న సాయంత్రం ఇరుగాళమ్మ ఆలయం వద్ద కాలేషా ఆడుకుంటూ అక్కడ ఉన్న ఓ పెట్రోల్‌ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్‌ అనుకొని తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్యాగ్స్ :