గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో పలువురు డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. శేర్‌లింగంపల్లి డిప్యూటీ కమిషనర్‌గా ప్రశాంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఆమె, ముకుంద్ రెడ్డి రిటైర్‌మెంట్ కారణంగా కొత్తగా శేర్‌లింగంపల్లి DCగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు.