మయన్మార్ భూకంపం ప్రభావంతో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ పిల్లల ఆస్పత్రిలో ఒక్కసారిగా భారీ ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో నవజాత శిశువుల వార్డులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ప్రకంపనలు తీవ్రం అవుతున్నా.. సిబ్బంది అక్కడి నుంచి భయంతో పారిపోకుండా శిశువులను కాపాడడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిన్నారులను కాపాడిన వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.