ట్రంప్‌కు 1000 డాలర్ల జరిమానా

50చూసినవారు
ట్రంప్‌కు 1000 డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. ఆయనకు వెయ్యి డాలర్ల జరిమానా విధించింది. ఈ కేసులో గ్యాగ్ ఉత్తర్వులను 9 సార్లు ఉల్లంఘించారంటూ ట్రంప్‌నకు కోర్టు గతవారం 9 వేల డాలర్ల జరిమానా విధించిన సంగతి గమనార్హం. మరోసారి ఇలానే వ్యవహరిస్తే జైలు శిక్ష విధిస్తామంది.

సంబంధిత పోస్ట్