TS: నాగకన్యలా మారుతున్న యువతి.. చర్మంపై పొలుసులు

100579చూసినవారు
TS: నాగకన్యలా మారుతున్న యువతి.. చర్మంపై పొలుసులు
కరీంనగర్ (D) సైదాపూర్ (M) ఎగ్లాస్పూర్ లో కృష్ణవేణి అనే యువతి గత ఆరేళ్లుగా పాములా మారుతుందని అంటున్నారు. దీనిపై కృష్ణవేణి మాట్లాడుతూ.. నాగుపాము కలలో కనిపించి తనకు గుడి కట్టాలని చెప్పిందని అన్నారు. అప్పటి నుండి పాము తనమీదికి వచ్చినట్టు అలాగే తన చర్మం కూడా పాములాగా మారుతుందని.. ఇలా ఆరేళ్లుగా జరుగుతుందని చెప్పారు. దీంతో గ్రామంలో నాగదేవతకు గుడి కట్టాలని నిర్ణయించుకొని ఊర్లో చెప్పడంతో గ్రామస్తుల ఆర్థిక సాయంతో ఆమె గుడి నిర్మాణం చేపట్టింది. తనకు ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు చెప్పారని తెలిపింది.

సంబంధిత పోస్ట్