నేటితో ముగియనున్న టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు

74చూసినవారు
నేటితో ముగియనున్న టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు
టీఎస్ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ప్రైమరీ ‘కీ’ని ఈనెల 12న ఉదయం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నపత్రాన్ని ఎప్‌సెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రైమరీ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈనెల 14న ఉదయం 10 గంటల వరకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్