రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ స్పందించిన తీరు విమర్శలకు దారితీసింది. ఆమె ప్రసంగం 'వెరీ బోరింగ్. నో కామెంట్' అని రాహుల్ అన్నారు. ఇక సోనియానేమో 'పూర్ లేడీ. చదివీ చదివీ చివరకు అలసిపోయారు. అంత చదవాల్సింది కాదు' అని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆదివాసీలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటేనని BJP మండిపడింది.