సచివాలయంలోకి ఇద్దరు నకిలీ ఉద్యోగులు

62చూసినవారు
సచివాలయంలోకి ఇద్దరు నకిలీ ఉద్యోగులు
తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశంలో ఉండగా, ఇద్దరు నకిలీ ఉద్యోగులు లోపలికి ప్రవేశించారు. వారు ఆరో అంతస్తుకు వెళ్లే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తరచూ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్ చేయడం భద్రతా చర్యలపై అనేక ప్రశ్నలు వేస్తోంది.

సంబంధిత పోస్ట్