దేశ రాజధాని ఢిల్లీలోని వెల్ కమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. ఓ వ్యక్తిని కాల్చి చంపినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ప్రదీప్ అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో పడి ఉన్నాడు. అక్కడికి 300 మీటర్ల దూరంలో మరో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తిపై కూడా కాల్పులు జరిపారు. వీరిద్దరూ స్నేహితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.