ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమించిన యోధురాలు. ఈమె అసలు పేరు రుక్మిణి. 1920లో నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించి 11 ఏళ్లకే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డిని పెళ్లి చేసుకుంది. అప్పుడే ఈమె పేరు కమలాదేవిగా మార్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉద్యమాలలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 1946–48లోరజకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గొరిల్లా దళాన్నికూడా ఏర్పాటు చేసి చేశారు.