జగ్గయ్యపేటలో వ్యక్తి దారుణ హత్య (వీడియో)

78చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చెరువు బజార్‌లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో శ్రీనివాస్ అనే వ్యక్తిని బత్తుల కిషోర్, శివ అనే నిందితులు హత్య చేశారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్