వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

61చూసినవారు
AP: తిరుపతి జిల్లాలో వరద ప్రవాహంలో ఇద్దరు యువకులు కొట్టుకెళ్లిన ఘటన జరిగింది. చిట్టమూరు మండలం తాగేడు సమీపంలో ఉన్న బాలచంద్ర రెడ్డి భవనం దగ్గరలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు బైక్‌పై మల్లాం వెళ్తూ వరద నీటిని దాటేందుకు ప్రయత్నించారు. బైక్‌తో సహా ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుల కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్