కొవిడ్‌తో టైప్‌-1 మధుమేహ లక్షణాలు వేగవంతం

60చూసినవారు
కొవిడ్‌తో టైప్‌-1 మధుమేహ లక్షణాలు వేగవంతం
కొవిడ్‌-19 బారినపడ్డ చిన్నారుల్లో టైప్‌-1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది. టైప్‌-1 మధుమేహం అనేది ఆటోఇమ్యూన్‌ రుగ్మత. ఈ రుగ్మతున్న వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, తీవ్ర అలసట, దృష్టి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. చిన్నారులు కొవిడ్‌-19 బారినపడితే వారిలో టైప్‌-1 మధుమేహ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందని కనుగొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్