హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భర్త వరకట్న వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక (35), సతీష్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు రాయదుర్గంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని దేవిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.