మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ జట్టు 44 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లకు 44 పరుగులకే కుప్పకూలింది. విండీస్ జట్టు బ్యాటర్లలో అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా టీమిండియా బౌలర్లలో పరుణికా సిసోదియా 3, జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టారు.