AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో రేషనలైజేషన్ చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ఇప్పుడున్న విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.