IPL-2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్లో భువనేశ్వర్ వేసిన నాలుగో బంతికి జితేష్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి CSK స్కోర్ 26/3గా ఉంది. క్రీజులోకి సామ్ కరన్ వచ్చారు. రచిన్ రవీంద్ర 16 పరుగులతో కొనసాగుతున్నారు.