జులైలో శాకాహార భోజనం తయారీ సగటు ధర జూన్‌తో పోలిస్తే 11% పెరిగిందని.. టమాటా ధరలు ప్రియం కావడమే ఇందుకు కారణమని క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. జూన్‌తో పోలిస్తే జులైలో మాంసాహార భోజనం ధర 6% పెరిగిందని పేర్కొంది. వెజ్ థాలి ప్లేట్ సగటు ధర 2024 జూన్‌లో రూ.29.4 కాగా. జులైలో రూ.32.6కు పెరిగింది. నాన్ వెజ్ థాలి ప్లేటు సగటు ధర జూన్‌లో రూ.58 కాగా, బ్రాయిలర్ చికెన్ ధర 6% పెరగడంతో, జులైలో ఈ వ్యయం రూ.61.4కు పెరిగింది.