హర్యానాలోని పంచకులలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంబాలా ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.