మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ట్రాఫిక్ పోలీస్ అమానుషంగా ప్రవర్తించాడు. ఆనంద్ నగర్ కూడలి వద్ద గవర్నర్ కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి రోడ్డు పక్కగా నిల్చొన్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడ్ని చూసి కోపంతో అతడ్ని లాగి కిందపడేశాడు. పైకి లేచిన ఆ వ్యక్తి చెంపపై కొట్టాడు. అనంతరం కాలితో తన్నుతూ వార్నింగ్ ఇచ్చాడు. దీనిని సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.