ఎల్బీనగర్: పనికోసం బయటకు వెళ్లిన యువతి అదృశ్యం

59చూసినవారు
ఎల్బీనగర్: పనికోసం బయటకు వెళ్లిన యువతి అదృశ్యం
పనికోసం బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తట్టి అన్నారం, ఆర్కేనగర్ కు చెందిన దేవులపల్లి వెన్నెల బట్టల దుకాణంలో పని చేస్తుంది. గత నెల 29న పనికి వెళ్లిన వెన్నెల రాత్రైనా ఇంటికి రాలేదు. బంధువుల, స్నేహితులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్