కోస్గి: అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించాలి

60చూసినవారు
కోస్గి: అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించాలి
అర్హులైన ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలకు ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వెరిఫికేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్ పేట్ గ్రామంలో పరిశీలించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్