పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామంలో రైతు వేదిక భవనంలో గురువారం రుణమాఫీ సంబరాలలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ. రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.