పరిగి పట్టణంలో శనివారం ప్రగతిశీల మహిళా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గీత మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తానన్న హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకురాలు పద్మమ్మ, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.