విద్యాశాఖలోని సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కేజీబీవీ టీచర్లు, సిబ్బంది, MIS కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, పిఈటీలు, ఆర్ట్ అండ్ క్రాప్ట్ టీచర్స్ తదితర ఎస్ఎస్ఎ ఉద్యోగులు తమ డిమాండ్స్ పరిష్కరించడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఎస్ఎ ఉద్యోగుల సంఘం తాండూరు ప్రతినిధులు శుక్రవారం తెలిపారు.