వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని ఆలేడు గ్రామంలో కార్తీకమాసం ముగింపు ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూరంతో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి వారిని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. గ్రామానికి చెందిన దంపతుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య యజ్ఞయాగాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.