సెక్రటేరియట్ పరిధిలో 144 సెక్షన్ విధింపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని సచివాలయ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. సచివాలయం నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ధర్నాలు, ర్యాలీలను నిషేధించింది. ఇందిరాపార్క్‌లో ధర్నాలు, ర్యాలీలు తీసుకోవచ్చని నగర పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే సచివాలయంలో ప్రభుత్వం వాస్తు మార్పులు చేసిన విషయం తెలిసిందే.