విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించారు. అంబాలాల్ సారాభాయ్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రమ్ సారాభాయ్ ఒకడు. తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రమ్ తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, నెహ్రూ వంటి ప్రముఖులు వస్తుండేవారు.