స్వదేశానికి వినేశ్‌ ఫొగాట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న భారత రెజ్లర్‌ (వీడియో)

60చూసినవారు
ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌ చేరి.. అనూహ్య రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వినేశ్‌ ఫొగాట్‌ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆమెను పలువురు ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :