చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ Vivo.. Vivo T4x పేరుతో తొలి మొబైల్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్‌లో 50MP AI కెమెరా, 6500mah బ్యాటరీ కలిగివుంది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6GB+128GB వేరియంట్ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. 8GB+128GB రూ.14,999, 8GB+256GB రూ.16,999గా వివో పేర్కొంది. మార్చి 12 నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.