తమిళనాడు కడలూరు జిల్లా కరువెపంపట్టికి చెందిన కలైయారసన్ అనే యువకుడితో ఓ యువతికి ఇటీవల పెళ్లైంది. అదే రోజున దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎంతో ఆశతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన వరుడికి భార్య షాక్ ఇచ్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రియుడితోనే జీవిస్తానని తెగేసి చెప్పింది. అంతటితో ఆగకుండా.. భర్త ముందే ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడింది. కొన్ని రోజులకు సద్దుకుంటుందని అనుకున్న భర్తకు..జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చింది. ప్రస్తుతం వరుడు చికిత్స పొందుతున్నాడు.