ప్రయాణాలలో వాంతులవుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి

80చూసినవారు
ప్రయాణాలలో వాంతులవుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి
చాలామందికి ప్రయాణాలలో కళ్లు తిరగడం లేదా వాంతులు కావడం జరుగుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు.. ఈ టిప్స్ ఫాలో చేస్తే సరి. కారులో ప్రయాణం చేస్తున్నపుడు ముందు సీటులో కూర్చోవడం మంచిది. ఇక బస్సుల్లో కూడా ముందు వరుసలో కూర్చోవటం ఉత్తమం. ఇంకా రైలులో అయితే రైలు కదిలే దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి. వీలైతే గాలి తగిలేలా కిటికీ పక్కన కూర్చునేట్లు చూసుకోండి. అల్లంతో చేసిన ఏదైనా పదార్థాన్ని తినడం వల్ల వికారం తగ్గిస్తుంది. యాలకులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్