జమ్ముకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో నూతన వక్ఫ్ సవరణ చట్టంపై గందరగోళం నెలకొంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేతృత్వంలోని మహా కూటమి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే, అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దానిపై వాయిదా తీర్మానం ద్వారా సభలో చర్చించలేమనే నియమం స్పష్టంగా చెబుతోందని అన్నారు.