5వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

84చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్ల గూడెం గ్రామంలో మంగళవారం గుడుంబా స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. బోర్ల గూడెం గ్రామంలో దేవసింగ్ అనే వ్యక్తి గుడుంబ తయారు చేసే స్థావరంపై దాడులు చేశారు. 25 డ్రమ్ములలో పులియపెట్టిన 5వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 200 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొన్నారు. సహకరిస్తున్న తిరుపతి, లౌడియా తిరుపతి, నరసింహ, మహేష్ పై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్