భూపాలపల్లిలో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్, మత్స్య, విద్యుత్, ఆబ్కారీ, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.