మొగుళ్లపల్లి మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ బి. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఎస్ ఐ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు డిసెంబరు 31 న మండల వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామంలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనం నడిపితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.