జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కు కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు తెలియజేయడం కొరకు జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.