ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి అని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాటకాల సుధాకర్ ను ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ గత 41 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేసి సేవలు అందించడం అభినందనీయం అన్నారు. పదవీ విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.