తాడిచర్ల ఓసిపిని సందర్శించిన సెంట్రల్ కోల్ కంట్రోలర్

1175చూసినవారు
తాడిచర్ల ఓసిపిని సందర్శించిన సెంట్రల్ కోల్ కంట్రోలర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల లోని ఓసిపి బ్లాక్ 1 బొగ్గు గనిని కోలకత్తా సెంట్రల్ కోల్ కంట్రోలర్ డికె జా, మైనింగ్ మేనేజర్ సమ్రాట్ దత్త తాడిచర్ల ఓసిపిని శనివారం సందర్శించారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గ్రేడ్ డిక్లర్ కొరకు కోల్ శాంపిల్స్ సేకరించి నాణ్యతను పరిశీలించారు. కాగా 2022 సంవత్సరానికి గాను మూడవ సారి బొగ్గు నాణ్యతను పరిశీలించినట్లుగా అధికారులు తెలిపారు. వారి వెంట టియస్ జెన్కో మేనేజర్ మోహన్ రావు, ఎస్ఈ వసంత్ రావు, ఏఎమ్మార్ మైనింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, జనరల్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి, సరోత్తం, సర్వే డిజీఏం జెన్కో, ఏఎమ్మార్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్