టిఆర్ఎస్ నాచారం మహిళ గ్రామ కమిటీ ఎన్నిక

341చూసినవారు
టిఆర్ఎస్ నాచారం మహిళ గ్రామ కమిటీ ఎన్నిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని నాచారం గ్రామ టిఆర్ఎస్ మహిళా గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ సంపత్ శుక్రవారం తెలిపారు. మంథిని నియోజకవర్గ ఇంచార్జీ పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా వావిలాల సమ్మక్క, ఉపాధ్యక్షురాలిగా మందారపు సుశీల, ప్రదాన కార్యదర్శి గా ఇసునపు రజీత, కోశాధికారిగా కన్నూరి జ్యోతి, ప్రచార కార్యదర్శిగా కుమ్మరి రజీత కార్యవర్గ సభ్యులుగా దొగ్గెల కవిత, సరోజన, రాదలు ఎన్నికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్