భూపాలపల్లి జిల్లా కాటారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మీనాక్షీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. దీంతో మిల్లులో ఉన్న వెయ్యి క్వింటాల్ పత్తి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.